సీఎం జగన్‌ పై మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే సంచలన వ్యాఖ్యలు !

-

సీఎం జగన్‌ పై మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే సంచలన వ్యాఖ్య లు చేశారు. 1200 కోట్లు మంగళగిరి అభివృద్ధికి కేటాయిస్తానన్న ముఖ్యమంత్రి జగన్‌ ఒక్క రూపాయి ఇవ్వలేదని ఫైర్‌ అయ్యారు. నేను రాజశేఖర్ రెడ్డి అభిమానిని…రాజశేఖర్ రెడ్డి బిడ్డ షర్మిలను అభిమానించే వ్యక్తిని అని కొనియాడారు. నా రాజకీయ ప్రయాణం షర్మిల తోనేనని స్పష్టం చేశారు. ఆమె ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీలోనే నేను ఉంటానని ప్రకటించారు. షర్మిల కాంగ్రెస్ పార్టీలో ఉంటే ఆ పార్టీని బలోపేతం చేయడానికి నా శక్తివంచన లేకుండా కృషి చేస్తానని వెల్లడించారు మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే.

ramakrishna

నేను నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశానని తెలిపారు. మంత్రి పదవి ఇవ్వలేదని రాజీనామా చేయాలనుకుంటే రెండేళ్ల క్రితం రాజీనామా చేసేవాడిని అని వివరించారు మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో 175 సీట్లు గెలుస్తానంటున్న ముఖ్యమంత్రి జగన్‌… నియోజకవర్గాల్లో చేస్తున్న అభివృద్ధి ఏంటో చెప్పాలని నిలదీశారు మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే. కుప్పం, పులివెందుల నియోజకవర్గాలను టార్గెట్గా పెట్టుకున్న ప్రభుత్వం మిగతా నియోజకవర్గాలను కూడా అభివృద్ధి చేయాలని కోరారు మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే.

Read more RELATED
Recommended to you

Latest news