చంద్రబాబును ఓడించి.. భరత్ ను గెలిపించండి….మంత్రిని చేస్తా- సీఎం జగన్‌

-

చంద్రబాబును ఓడించి.. భరత్ ను గెలిపించండి….మంత్రిని చేస్తానని కుప్పం ప్రజలకు అదిరిపోయే ఆఫర్‌ ఇచ్చారు సీఎం జగన్‌. వచ్చే ఎన్నికల్లో భరత్ ను గెలిపించండి…. గెలిపిస్తే మంత్రిని చేస్తానని వెల్లడించారు. ఇవాళ కుప్పంలో సీఎం జగన్‌ పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.

cm jagan on bharath

ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ….ఈ 57 నెలల్లో కుప్పం నియోజకవర్గంలోని లబ్ధిదారులకు (ఒక్కొక్కరు ఒకటికన్నా ఎక్కువ పథకాల ద్వారా లబ్ధి పొందిన నేపథ్యంలో) డీబీటీ ద్వారా రూ.1,400 కోట్లు.. డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా రూ.1,889కోట్ల లబ్ధి అందించామన్నారు. చంద్రబాబు మంచి చేస్తే పొత్తులు ఎందుకు? అని నిలదీశారు సీఎం జగన్. నా దెబ్బకు ఇప్పుడు కుప్పంలో ఇళ్లు కట్టుకుంటున్నాడని చంద్రబాబు పై సెటైర్లు పేల్చారు సీఎం జగన్. పులివెందుల, కడపను చంద్రబాబు తిడతాడు….నేను కుప్పం నీ ఎప్పుడూ తిట్టలేదు…. మిమ్మలని గుండెల్లో పెట్టుకున్నానన్నారు సీఎం జగన్.

Read more RELATED
Recommended to you

Exit mobile version