నిరుద్యోగులకు సీఎం జగన్ గుడ్‌న్యూస్ చెప్పారు. మహిళా శిశు సంక్షేమశాఖపై క్యాంపు కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్.జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ కీలక ఆదేశాలు జారీ చేశారు. సూపర్‌వైజర్లపైన కూడా పర్యవేక్షణ ఉండాలన్న సీఎం జగన్…స్త్రీ శిశు సంక్షేమ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీతో పాటు, పదోన్నతుల ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తిచేయాలని పేర్కొన్నారు.
63 సీడీపీఓ పోస్టుల భర్తీకి సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వీటిని వీలైనంత త్వరగా భర్తీచేయాలని ఆదేశాలు చేశారు. నూటికి నూరుశాతం పిల్లలకు పాలు పంపిణీ కావాలని.. అలాగే పిల్లలకు ప్లేవర్డ్ పాలు పంపిణీని పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించాలన్నారు. మూడు నెలల తర్వాత పూర్తిస్థాయిలో ప్లేవర్డ్ మిల్క్ పంపిణీ కావాలన్న సీఎం జగన్…ఈ మేరకు షెడ్యూల్ రూపొందించుకోవాలన్నారు. అంగన్‌వాడీలలో బోధనపైనా కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్న సీఎం…ఉత్తమ బోధనలను అందుబాటులోకి తీసుకురావాలని వెల్లడించారు.