అమరావతిలోని కృష్ణయపాలెంలో సీఎం జగన్ ఈనెల 24వ తేదీన పర్యటించనున్నారు. జగనన్న లేఅవుట్లలో గృహ నిర్మాణ శంకుస్థాపన, 47,000 మంది లబ్ధిదారులకు ఇళ్ల మంజూరు పత్రాలను సీఎం జగన్ అందించనున్నారు. ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ, అనంతరం ఇటుకల తయారీ యూనిట్, పైలాన్ ను సీఎం జగన్ ప్రారంభించనున్నారు. ఆ తర్వాత వెంకటపాలెంలో జరిగే బహిరంగ సభలో సీఎం ప్రసంగించనున్నారు.
అలాగే, జగనన్న తోడు పథకం లో భాగంగా నాలుగో ఏడాది తొలి విడత కార్యక్రమాన్ని జగన్ ప్రభుత్వం రేపు నిర్వహించనుంది. 5.1 లక్షల మంది ఖాతాలలో పదివేల రూపాయల చొప్పున ఏకంగా 510 కోట్లను జమ చేయనుంది జగన్ సర్కార్. అలాగే వడ్డీ మాఫీ కింద 4.58 లక్షల మందికి 10 కోట్లను చెల్లించనుంది. చిరు వ్యాపారాలకు అండగా నిలిచి ఎందుకు జగన్ సర్కార్ ఈ పథకాన్ని అమలు చేస్తోంది. విడతలవారీగా రూ. 10000 రుణాన్ని వడ్డీ లేకుండా అందిస్తోంది.