రెండు రోజుల అన్నమయ్య, కడప జిల్లాల పర్యటన ముగించుకుని తాడేపల్లికి చేరుకున్న సీఎం జగన్…విజయవాడ పర్యటనకు బయలు దేరనున్నాడు. ఇవాళ సీఎం వైఎస్ జగన్ విజయవాడ పర్యటనకు వెళతారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించనున్న భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి ఉత్సవాలలో పాల్గొననున్నారు సీఎం జగన్.
ఇందులో భాగంగానే ఇవాళ ఉదయం 10.20 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరనున్నారు. మొదట ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంకు చేరుకుంటారు, అక్కడ మైనారిటీస్ వెల్పేర్ డే, నేషనల్ ఎడ్యుకేషన్ డే సందర్భంగా భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి ఉత్సవాలలో పాల్గొననున్నారు సీఎం జగన్. కాగా ఆంధ్రప్రదేశ్ రైతులకు అదిరిపోయే శుభవార్త చెప్పారు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి. కరువు మండలాల ప్రకటనకు… పంటల బీమాకు ఎలాంటి సంబంధం లేదని సీఎం జగన్ క్లారిటీ ఇచ్చారు. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు సీఎం జగన్మోహన్ రెడ్డి. ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నూట మూడు మండలాలను మాత్రమే కరువు మండలాలుగా ప్రకటించడంపై రైతులు మరియు ప్రతిపక్షాల నుంచి నిరసన వ్యక్తమైన సంగతి తెలిసిందే.