నేడు సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొననున్న సీఎం జగన్

-

సీఎం జగన్ విజయవాడలో పర్యటించనున్నారు. ఇవాళ ఇందిరాగాంధీ స్టేడియంలో ప్రభుత్వం నిర్వహిస్తున్న సెమీ క్రిస్మస్ వేడుకల్లో ఆయన పాల్గొంటారు. ఇవాళ సాయంత్రం 5:20 గంటలకు తాడేపల్లి నుంచి స్టేడియానికి చేరుకొని వేడుకలు, హై-టీలో పాల్గొంటారు. అనంతరం తిరిగి తాడేపల్లిలోని నివాసానికి చేరుకుంటారు సీఎం జగన్.

CM Jagan will participate in the semi-Christmas celebrations today

ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. కాగా, ‘జగనన్న విదేశీ విద్యాదీవెన’ కీలక ప్రకటన చేసింది జగన్ సర్కార్. నేడు ‘జగనన్న విదేశీ విద్యాదీవెన’ నిధులు జమ చేయనుంది ఏపీ ప్రభుత్వం. అర్హులైన 390 మంది విద్యార్థులకు రూ.41.60 కోట్లు జమ చేయనుంది జగన్ సర్కార్. సివిల్‌ సర్వీసెస్‌ ప్రిలిమినరీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన 95 మందికి.. ‘జగనన్న విదేశీ విద్యాదీవెన’ రిలీజ్ చేయనుంది. వారిలో తిరిగి మెయిన్స్‌లో ఉత్తీర్ణత సాధించిన 11 మంది అభ్యర్థులకు ప్రోత్సాహకంగా రూ.100.50 లక్షలు అందించనుంది ఏపీ ప్రభుత్వం. మొత్తం రూ.42.6 కోట్లు నేడు బటన్‌ నొక్కి జమచేయనున్నారు సీఎం వైఎస్‌ జగన్‌.

Read more RELATED
Recommended to you

Exit mobile version