వచ్చే ఎన్నికల్లో వైసీపీ పార్టీకి 30 సీట్లే వస్తాయి !

-

రానున్న ఎన్నికల్లో వైకాపా నెల్లూరు జిల్లాలో ఒక్క స్థానం కూడా గెలిచే ఛాన్స్ లేదని, ఇక ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 30 స్థానాలు మాత్రమే గెలిచే అవకాశం ఉందని రఘురామకృష్ణ రాజు తెలిపారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్, ఎన్నికల ముందు మహిళలకు ఇచ్చిన మద్య నిషేధం హామీ, ఉద్యోగులకు, ఎస్సీ వర్గాలకు ఇచ్చిన హామీలను విస్మరించడం వల్ల… రానున్న మూడు నెలల్లో పార్టీ గ్రాఫ్ మరింత పడిపోయే ప్రమాదం ఉందని, ఇక్కడితో ఆగితే కనీసం 30 స్థానాలలో వైకాపా గెలిచే ఛాన్స్ ఉందని, లేకపోతే పరిస్థితి మరింత దిగజారవచ్చునని అన్నారు.

రాయలసీమ ప్రాంతంలోనూ వైకాపా గ్రాఫ్ పడిపోయిందని, నియోజకవర్గాలలో ఎంతో పేరు ప్రఖ్యాతలు ఉన్న ఎమ్మెల్యేలను రానున్న ఎన్నికల్లో అభ్యర్థులుగా మారుస్తామని ప్రకటించడమే దానికి కారణమై ఉండొచ్చునని, ఇంకా తమ పార్టీ పరిస్థితి మరింత దిగజారితే, సింగిల్ డిజిట్ కే పరిమితమైనా ఆశ్చర్య పోవలసిన అవసరం లేదని అన్నారు. ప్రస్తుతం అతిశయోక్తిగా అనిపిస్తున్నా ఇది అక్షరాలా నిజమని రఘురామకృష్ణ రాజు గారు పేర్కొన్నారు. వైకాపాలో టికెట్ దక్కని వారు కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత, తమ పార్టీ నాయకత్వానికి చుక్కలు కనిపించనున్నాయని రఘురామకృష్ణ రాజు అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version