CM YS Jagan : ఈ నెల 25 నుంచి సీఎం జగన్ జిల్లాల పర్యటనకు బయలు దేరనున్నారు. మరో వారంలో ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల ఎంపికను పూర్తి చేసి ఈనెల 25 నుంచి జిల్లాల పర్యటనకు సీఎం జగన్ సన్నాహాలు చేస్తున్నారు.
తొలి దశలో రోజుకు రెండు జిల్లాల్లో బహిరంగ సభలు నిర్వహించనున్నారు. అలాగే కేడర్ తో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. తొలి సభ శ్రీకాకుళం జిల్లాలో జరుగుతుందని సమాచారం. ఇప్పటికే రూట్ మ్యాప్ సిద్దమైనట్లు తెలుస్తోంది. ఎన్నికల నోటిఫికేషన్ తర్వాత రెండో దశలో రాష్ట్రమంతా మరోసారి పర్యటించనున్నారట.
కాగా, వైసీపీ మూడో లిస్ట్ రిలీజ్ అయింది. ఇప్పటికే రెండు విడతలు విడుదల చేసిన ముఖ్యమంత్రి జగన్ 23 మందితో కూడిన మూడో జాబితాను తాజాగా విడుదల చేశారు.
కొత్త ఇంచార్జులు వీరే..
తిరువూరు- నల్లగట్ల స్వామి దాస్
పెడన- ఉప్పాల రాము
సూళ్లూరుపేట-తిరుపతి ఎంపీ గురుమూర్తి
రాయదుర్గం -మెట్టు గోవిందరెడ్డి
మార్కాపురం- జంకె వెంకటరెడ్డి
మడకశిర శుభకుమార్
గంగాధర నెల్లూరు- కృపాలక్ష్మి
గూడురు – మెరిగ మురళి
శ్రీకాళహస్తి-బియ్యపు మధుసూదన్
అనకాపల్లి అసెంబ్లీ-కిలారు పద్మ
చిత్తూరు-విజయేంద్రరెడ్డి
పెనమలూరు- జోగి రమేశ్
పూతలపట్టు-డాక్టర్ సునీల్
ఆలూరు- విరూపాక్షి
దర్శి అసెంబ్లీ-శివప్రసాద్ రెడ్డి
పార్లమెంట్ పరిధిలో….
విజయనగరం పార్లమెంట్- చిన్న శ్రీను
ఏలూరు ఎంపీ-కారుమూరి సునీల్
అనకాపల్లి ఎంపీ-అడారి రమాకుమారి
విశాఖ
పార్లమెంట్- బొత్స ఝాన్సీ