ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సీఎం జగన్ సంచలన ప్రకటన చేశారు. రిజిస్ట్రేషన్ తర్వాత ఒరిజినల్ సర్టిఫికెట్లే ఇస్తామన్నారు సీఎం జగన్. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సీఎం జగన్ పుల్ క్లారిటీ ఇచ్చారు. వందేళ్ల తరువాత మొదటిసారి సర్వే చేసి భూ రికార్డులు సిద్ధం చేశామని… భూములపై సర్వహక్కులు కల్పించేదే ల్యాండ్ టైటిలింగ్ చట్టం తీసుకొచ్చినట్లు వివరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 17వేల గ్రామాల్లో రెవెన్యూ రికార్డులు అప్డేడేట్ చేశామన్నారు సీఎం జగన్.
టైటిల్స్ లో తప్పులు దొర్లకుండా చూడడం ప్రభుత్వ గ్యారెంటీ ఉంటుందన్నారు. ల్యాండ్ టైటిలింగ్ చట్టంలో టైటిల్ ఇన్సూరెన్స్ కూడా వుందన్నారు. ఈ చట్టంపై చంద్రబాబు వివాదం సృష్టిస్తున్నారని ఆగ్రహించారు. జిరాక్స్ కాపీలు ఇస్తారన్నది తప్పుడు ప్రచారమన్నారు. ఇప్పటికే 9 లక్షల మంది ఒరిజినల్స్ తీసుకున్నారన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కింద రిజిస్ట్రేషన్ తర్వాత ఒరిజినల్ సర్టిఫికెట్లే ఇస్తామన్నారు సీఎం జగన్.