రేపు సీఎం వైఎస్‌ జగన్‌ శ్రీకాకుళం జిల్లా పలాస పర్యటన

-

రేపు సీఎం వైఎస్‌ జగన్‌ శ్రీకాకుళం జిల్లా పలాస పర్యటనకు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా డాక్టర్‌ వైఎస్సార్‌ సుజలధార ఉద్దానం మంచినీటి ప్రాజెక్ట్‌ ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. అలాగే.. పలాస కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్, సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రారంభోత్సవంలో పాల్గొంటారు సీఎం జగన్‌. అనంతరం బహిరంగ సభలో కూడా సీఎం జగన్‌ ప్రసంగిస్తారు.

CM Jagan laid foundation stone for Transco sub stations today
CM YS Jagan will visit Srikakulam District Palasa tomorrow

ఇందులో భాగంగానే.. రేపు ఉదయం 8 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరనున్న సీఎం జగన్‌.. మొదటగా కంచిలి మండలం మకరాంపురంలో డాక్టర్‌ వైఎస్సార్‌ సుజలధార ఉద్దానం మంచినీటి ప్రాజెక్టును ప్రారంభించనున్నారు.

అనంతరం పలాస చేరుకుని కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్, సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభించనున్నారు సీఎం జగన్. రైల్వే క్రీడా మైదానంలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్న ముఖ్యమంత్రి జగన్.. సాయంత్రం తిరిగి తాడేపల్లికి ప్రయాణం కానున్నారు. ఇక ఇవాళ తిరుమతి కూడా జగన్‌ వెళుతున్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news