CM YS Jagan : ఇవాళ సీఎం వైఎస్‌ జగన్‌ కాకినాడ పర్యటన

-

ఇవాళ వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక పెంపు కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ మేరకు సీఎం వైఎస్‌ జగన్‌ కాకినాడ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక పెంపు కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి. ఇవాళ ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరనున్న సీఎం జగన్…కాకినాడ రంగరాయ మెడికల్‌ కాలేజ్‌ గ్రౌండ్స్‌లో బహిరంగ సభలో పాల్గొంటారు. ఇక అనంతరం వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక పెంపు కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. మధ్యాహ్నం తాడేపల్లికి తిరుగు ప్రయాణం కానున్నారు.

CM Jagan will be in Vijayawada tomorrow

గత ప్రభుత్వం ఎన్నికలకు 2 నెలల ముందు వరకు కేవలం నెలకు రూ.1000 చొప్పున, ఎన్నికలకు 6 నెలల ముందు వరకూ 39 లక్షల మందికి సగటున ఖర్చుచేసిన మొత్తం నెలకు రూ.400 కోట్లు మాత్రమే. 5 ఏళ్లలో అంటే 60 నెలల్లో గత ప్రభుత్వం పెన్షనర్లకు చేసిన ఖర్చు రూ.27,687 కోట్లు మాత్రమే. ఇచ్చిన మాట ప్రకారం ఈప్రభుత్వం నెలకు రూ.300 చొప్పున 66.34 లక్షల మందికి నెలకు సగటున చేస్తున్న ఖర్చు రూ.1968 కోట్లు. గడచిన 55 నెలల్లో జగనన్న ప్రభుత్వం పెన్షన్లపై చేసిన ఖర్చు రూ.83,526 కోట్లు.

Read more RELATED
Recommended to you

Exit mobile version