నేడు సీఎం వైఎస్ జగన్ తిరుపతి, బాపట్ల జిల్లాల పర్యటించనున్నారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో క్షేత్రస్ధాయి పర్యటించనున్నారు జగన్. ఉదయం 8.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరనున్న సీఎం జగన్….తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డి పాలెం వద్ద స్వర్ణముఖి నది కట్ట తెగి నష్టపోయిన ప్రాంతాల్లో పర్యటిస్తారు. గ్రామస్ధులు, తుపాను బాధితులతో నేరుగా మాట్లాడనున్న సీఎం జగన్….అనంతరం బాపట్ల జిల్లా మరుప్రోలువారి పాలెంకు చేరుకోనున్నారు.
తుఫాను బాధితులతో మాట్లాడిన అనంతరం కర్లపాలెం మండలం పాతనందాయపాలెంకు వెళ్ళనున్నారు సీఎం జగన్. రైతులతో మాట్లాడిన తర్వాత బుద్దాం చేరుకుని తుపాను వల్ల దెబ్బ తిన్న వరి పంటను పరిశీలించనున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి…అనంతరం రైతులతో సమావేశం అవుతారు. అనంతరం తాడేపల్లికి తిరుగు ప్రయాణం కానున్నారు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. ఈ మేరకు అన్ని ఏర్పాటు చేశారు అధికారులు.