Notices to former MLA Jeevan Reddy Mall : ఆర్మూర్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి ఊహించని షాక్ తగిలింది. ఆర్మూర్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి కష్టాలు చుట్టూ ముట్టాయి. ఆయన ఆర్మూర్ లో ఆర్టీసీ స్థలాన్ని లీజుకు తీసుకొని 5 అంతస్తుల భారీ షాపింగ్ మాల్ కట్టారు.
ఆర్టీసీకి అద్దె, విద్యుత్ బిల్లులు చెల్లించకుండా ఇన్ని రోజులు తప్పించుకున్నారు. అయితే ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం మారగానే అధికారులు నోటీసులు జారీ చేసి షాపింగ్ మాల్ కు కరెంటు నిలిపివేశారు. మూడు రోజుల్లో అద్దె, కరెంటు బకాయిలు రూ. 9.37 కోట్లు కట్టాలని హెచ్చరించారు.
ఇది ఇలా ఉండగా, తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం నుంచే ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై కాంగ్రెస్ కొత్త సర్కార్ ఫోకస్ చేస్తోంది. ముఖ్యంగా ఆరు గ్యారెంటీల అమలుపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తోంది. ఆ తర్వాత ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ప్రజా దర్బార్ నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఈ క్రమంలో ఇవాళ్టి నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాదర్బార్ ప్రారంభం కానుంది.