BREAKING: గుడ్లవల్లేరు కాలేజీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీ వద్ద మీడియా, విద్యార్థి సంఘం నేతలపై కాలేజ్ యాజమాన్యం దాడి చేసింది. విద్యార్థి సంఘం నేతలను పోలీసులు అడ్డుకోగా, వారి మధ్య తోపులాట చోటు చేసుకుంది. అనంతరం నేతలు రోడ్డుపై పడుకొని నిరసన తెలిపడం జరిగింది.
ఇక అనంతరం విద్యార్థి నేతలను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ముఖ్యంగా మీడియా మీద చేయి చేసుకున్న గుడ్లవల్లేరు కాలేజ్ యాజమాన్యంకు పోలీసులు సపోర్టుగా నిలిచారు. ఇక అటు మీరు ఎందుకు గొడవ చేస్తున్నారు అంటూ విద్యార్ధినులపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.