ప్రేమ పేరుతో వేధింపులు.. 9వ తరగతి విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

-

నేటి సమాజంలో ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోతోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు, శిక్షలు అమలు చేస్తున్నా ఆడపిల్లలపై వేధింపులు జరుగుతూనే ఉన్నాయి. దేశంలో ఎక్కడో ఓ చోట ప్రేమ పేరుతో ఆడపిల్లలను ఆట వస్తువులుగా భావించి వేధింపులకు పాల్పడుతూనే ఉన్నారు. ప్రేమ పేరుతో వేధింపులకు గురిచేసి అమాయక ఆడపిల్లల ప్రాణాలను పొట్టనబెట్టుకుంటున్నారు.

నిందితులకు ఎన్ని కఠిన శిక్షలు విధిస్తున్నా.. ఇలాంటి వాళ్ల తీరులో ఏమాత్రం చలనం లేకుండా పోతోంది. ఓ ఆకతాయి వేధింపులు భరించలేక ఓ యువతి ఆత్మహత్యాయత్నం చేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. వికారాబాద్ జిల్లా బంటారం మండలం తోర్మామిడిలో దారుణం చోటుచేసుకుంది. ఓ మైనర్ బాలుడి వేధింపులు భరించలేక మైనర్ అమ్మాయి ఆత్మహత్యాయత్నం చేసింది. పదవ తరగతి విద్యార్థి 9వ తరగతి చదువుతున్న విద్యార్థినిని ప్రేమ పేరుతో వేధింపులకు గురి చేశాడు.

వేదింపులు తాళలేక 9వ తరగతి విద్యార్థుని పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నం చేసింది. తనని పెళ్లి చేసుకుంటానని వేధిస్తున్నాడని తండ్రికి తెలిపింది విద్యార్థిని. ఇద్దరు విద్యార్థులు తోర్మామిడి ప్రభుత్వ పాఠశాలలోనే చదువుతున్నారు. విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడడంతో చికిత్స నిమిత్తం తాండూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం విద్యార్థిని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version