అమరావతి రైతులకు గుడ్ న్యూస్..ఫ్లాట్ల రిజిస్ట్రేషన్ల ప్రారంభం

-

అమరావతి నే ఏపీ రాజధానిగా అభివృద్ధి చేయాలని ఇటీవల హైకోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. అలాగే… అమరావతి రైతులకు మూడు నెలల్లోగా భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి కావాలని జగన్మోహన్ రెడ్డి సర్కారును ఆదేశించింది హైకోర్టు. అయితే కోర్టు తీర్పు కనుగుణంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోంది.

తాజా పరిస్థితులు చూస్తుంటే ఇలాంటి అనుమానాలు కలగడం సహజమే. ఎందుకంటే అమరావతి రైతులకు ప్లాట్ రిజిస్ట్రేషన్ తిరిగి ప్రారంభమైంది. హైకోర్టు తీర్పుతో జగన్ ప్రభుత్వం రిజిస్ట్రేషన్ ప్రక్రియను తిరిగి స్టార్ట్ చేసింది. రాజధాని కోసం 28 వేల మంది రైతులు భూములు ఇచ్చారు. మొత్తం దాదాపు 35 వేల ఎకరాల భూమిని అందించారు.

దీనికి ప్రతిగా వారికి ప్లాట్లను ఇచ్చేలా గత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీలో మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని ప్రకటించడంతో… అమరావతి అభివృద్ధి అయిపోయింది. దీంతో అప్పటి నుంచి ఏపీ రైతులు రాజధాని కోసం పోరాటం చేస్తున్నారు. ఈ తరుణంలోనే 4 రోజుల క్రితం ఏపీ హైకోర్టు… రైతులకు ఫ్లాట్లు రిజిస్ట్రేషన్ చేయించి ఇవ్వాలని ఆదేశించింది. దీంతో ఆ ప్రక్రియను ఇవాల్టి నుంచి జగన్ సర్కార్ ప్రారంభించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version