ఇలాంటి స్కూళ్లు దేశంలో ఎక్కడా లేవు : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

-

దేశ చరిత్రలోనే యంగ్ ఇండియా స్కూల్స్ ను రూ.11,600 కోట్లతో మంజూరు చేస్తూ నిన్న జీవో జారీ చేశామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఇలాంటి స్కూల్స్ ఈ దేశంలో ఎక్కడా లేవని తెలిపారు. 20-25 ఎకరాల్లో అన్ని వసతులతో టీచింగ్ స్టాప్స్ కి కూడా అక్కడే వసతి ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అంతర్జాతీయ స్థాయి విద్యా ప్రమాణాలు.. డిజిటల్ పాఠాలు ఉండేలా డిజైన్ చేసినట్టు తెలిపారు. ప్రైవేట్ లో చదివించలేని పిల్లలకు కార్పొరేట్ స్థాయి వసతులు కల్పిస్తామన్నారు. రాష్ట్ర విద్యా రంగంలో ఇది విప్లవాత్మక నిర్ణయం అని స్పష్టం చేశారు.

ప్రభుత్వం పై ఇబ్బందులు ఉన్నా.. ప్రజల జీవన స్థితి గతులు మార్చడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. పరిపాలన అంటే ఎలా ఉంటుందన్న దానికి నిదర్శనమే ఇంటిగ్రేటేడ్ స్కూల్స్ అని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గత పదేళ్ల ప్రభుత్వం గురుకులాలను కోళ్ల ఫారాలు, పశువుల షెడ్ లో పెట్టారు. కానీ పేద పిల్లలకు మంచి విద్యను  ఇవ్వాలని ప్రతీ రూపాయి వాళ్ల కోసమే ఖర్చు.. ఆ నాటి ప్రభుత్వం రూ.7.19 లక్షల కోట్లు అప్పు.. దానికి మిత్తి మీద పడుతున్నా అవి చెల్లిస్తూనే పథకాలు కొనసాగిస్తున్నామని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version