వాలంటీర్లను టెర్రరిస్ట్ లతో పోల్చడం దుర్మార్గం అన్నారు దేవినేని అవినాష్. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. వాలంటీర్ వ్యవస్థ ద్వారా లబ్దిదారులు ఇంటికే పథకాలు అందిస్తున్నామని తెలిపారు. టీడీపీ అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థను నిర్వీర్యం చేస్తారు. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ వాలంటీర్ వ్యవస్థపై చిల్లర వ్యాఖ్యలు మానుకోవాలి. పది సంవత్సరం అధికారంలో ఉ్యడి స్థానిక ఎమ్మెల్యే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేకపోయారు.
నియోజకవర్గంలో కుట్ర రాజకీయాలకు తెరలేపుతున్న స్థానిక టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్.. తూర్పు నియోజకవర్గం వైఎస్సార్సీపీ నాయకులందరూ సమన్వయంగా ఉండాలని కోరుకుంటున్నా. తూర్పు నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ జెండా ఎగరవేసేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి. రాష్ట్రంలో ప్రతి కుటుంబం సంతోషంగా ఉండాలన్నదే జగన్ కోరిక అన్నారు. ఎన్టీఆర్ హయాం లో మద్యనిషేధం చేస్తే మరల ప్రజలను మద్యం మత్తులోకి ముంచిన వ్యక్తి చంద్రబాబు కాదా? అని ప్రశ్నించారు. చంద్రబాబు హయాంలోనే రాష్ట్రంలో గంజాయి విచ్చలవిడితనానికి ఆద్యం పడిందన్నారు.