లిక్కర్ పాలసీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ తనని అరెస్ట్ చేయడంపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇప్పటికే ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేజ్రీవాల్ పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టీస్ స్వర్ణ కాంత శర్మ రేపు ఉదయం 10.30గంటలకు విచారణ చేపట్టనున్నారు.
ఢిల్లీ ఎక్సెజ్ పాలసీ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఈడీ అరెస్ట్ చేసింది. మనీల్యాండరింగ్కు పాల్పడ్డారంటూ అభియోగాలు మోపింది. రెండేళ్ల క్రితం ఎక్సెజ్ పాలసీ అమలులో భాగంగా లిక్కర్ కాంట్రాక్టర్ల నుంచి కేజ్రీవాల్ సుమారు రూ.100 కోట్లు ముడుపులు తీసుకున్నారని ఆరోపిస్తోంది. ప్రస్తుతం ఈ కేసు విచారణ నిమిత్తం కేజ్రీవాల్ ని అదుపులోకి తీసుకున్న ఈడీ మార్చి 28 వరకు తన కస్టడీలోనే ఉంచుకోనుంది. ఈ తరుణంలో ఈడీకి వ్యతిరేకంగా సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టు విచారించి తీర్పు ఇవ్వనుంది.