పూర్తయిన కస్టడీ.. కోర్టుకు మాజీ ఎంపీ నందిగం సురేశ్

-

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ను పోలీసులు కోర్టుకు తరలించారు. టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో ఆయన్ను పోలీసులు 2 రోజుల పాటు కస్టడీలో ప్రశ్నించారు. ప్రస్తుతం కస్టడీ ముగియడంతో సురేశ్‌ను కోర్టులో ప్రవేశపెట్టారు.మరోవైపు తనకు బెయిల్ ఇవ్వాలని సురేశ్ కోర్టును కోరారు. అయితే, కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందనేది ఉత్కంఠ మారింది. కాగా, వైసీపీ హయాంలో మంగళగిరి టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి జరిగింది.

వైఎస్సార్ పార్టీ నేతలు,కార్యకర్తలు భారీగా తరలివెళ్లి టీడీపీ కార్యాలయం గేట్లు, అద్ధాలు ధ్వంసం చేశారు.అంతేకాదు అక్కడ పని చేస్తున్న పలువురు సిబ్బందిని సైతం గాయపర్చారు. ఈ ఘటనపై పోలీసులు కేసులు నమోదు చేసినా ఆనాడు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈ కేసులో చర్యలకు ఆదేశించారు.నిందితులను గుర్తించి అరెస్ట్ చేశారు.వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ను ఈ కేసులోనే పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
అయితే, ఈ కేసులో కోర్టు ఆదేశాల మేరకు రెండ్రోజులు పోలీసులు కస్డడీకి తీసుకుని విచారించగా..కస్టడీ ముగియడంతో సురేశ్‌ను కోర్టులో ప్రవేశ పెట్టారు. వాదనలు ప్రస్తుతం కొనసాగుతుండగా.. తీర్పు ఏ విధంగా వస్తుందో వేచిచూడాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news