తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. తాడిపత్రి వెళ్లేందుకు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి హైకోర్టు అనుమతి ఇచ్చింది. సార్వత్రిక ఎన్నికల్లో తాడిపత్రిలో చెలరేగిన అల్లర్లలతో ఆ రోజు నుంచి తాడిపత్రికి పెద్దారెడ్డికి అనుమతి నిరాకరించింది. దింతో పోలీసులు తాడిపత్రికి వెళ్లకుండా అడ్డుకుంటున్నారని హైకోర్టులో తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పిటిషన్ వేశారు.

పిటిషన్‌పై విచారించి తాడిపత్రి వెళ్లేందుకు తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి షరతులతో అనుమతిచింది హైకోర్టు. కేవలం ఐదు వాహనాల్లో మాత్రమే తాడిపత్రికి వెళ్లాలని హైకోర్టు ఆదేశించింది. తగిన భద్రత కల్పించాలన్న హైకోర్టు ఆదేశాలతో జిల్లా ఎస్పీని కలిసి తాడిపత్రి వెళ్లేందుకు సిద్దమైన కేతిరెడ్డి పెద్దారెడ్డి… అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు.