ఇవాళ ఏపీకి ప్రధాని నరేంద్ర మోడీ వస్తున్న తరుణంలోనే చంద్రబాబు సంచలన పోస్ట్ పెట్టారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణ పనుల పునఃప్రారంభోత్సవానికి విచ్చేస్తున్న గౌరవ ప్రధాని మోడీకి మనఃపూర్వకంగా స్వాగతం పలుకుతున్నానని తెలిపారు. రాష్ట్ర ప్రజల కలల రాజధాని నిర్మాణాన్ని సాకారం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారం మరువలేనిదన్నారు.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి పౌరునికీ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు సృష్టించే ప్రజా రాజధానిగా అమరావతి ఆవిష్కృతం అవుతుందని చెప్పారు. సంపద సృష్టితో రాష్ట్రానికి ఒక చోదక శక్తిగా నిలబడుతుంది. ఇందుకు సహకరిస్తున్న గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారికి రాష్ట్ర ప్రజల తరపున మరొక్క మారు కృతజ్ఞతాపూర్వక స్వాగతం పలుకుతున్నానని పేర్కొన్నారు.