గొర్రెల స్కామ్ కేసులో కాంట్రాక్టర్ మొయినుద్దీన్‌ను అరెస్ట్ చేసిన ఏసీబీ

-

గొర్రెల స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. గొర్రెల స్కామ్ కేసులో కాంట్రాక్టర్ మొయినుద్దీన్‌ను అరెస్ట్ చేసింది ఏసీబీ. ఏసీబీ కేసు నమోదు తర్వాత దుబాయ్ పారిపోయాడు గొర్రెల స్కామ్ కేసులో కాంట్రాక్టర్ మొయినుద్దీన్‌. దుబాయ్ నుంచి హైదరాబాద్ తిరిగి రావడంతో ఇమిగ్రేషన్ అధికారుల సహకారంతో మొయినుద్దీన్‌ని అరెస్ట్ చేసింది ఏసీబీ.

ACB arrests contractor Moinuddin in sheep scam case
ACB arrests contractor Moinuddin in sheep scam case

కొనుగోలు చేసి గొర్రెల యజమానులకు డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టాడు మొయినుద్దీన్. ఏసీబీ దర్యాప్తులో రూ.700 కోట్ల నిధులు పక్కదారి పట్టాయని గుర్తించింది ఏసీబీ. ఈ కేసులో పశుసంవర్ధక శాఖ అధికారులతో పాటు మొత్తం 17 మందిని అరెస్ట్.. ప్రధాన నిందితుడుగా మొయినుద్దీన్ ఉన్నారు. మొయినుద్దీన్ అరెస్ట్ తర్వాత ఆయన ఇంట్లో సోదాలు చేసిన ఏసీబీ.. కీలక అంశాలు సేకరించింది.

Read more RELATED
Recommended to you

Latest news