ఏపీలో ఆరోగ్య శ్రీ వైద్య సేవలు నిలిచిపోవడంపై కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ట్వీట్ చేశారు. పేరుకు రైజింగ్ స్టేట్.. కానీ వైద్య సేవలకు దిక్కులేదని మండిపడ్డారు వైస్ షర్మిల. పేదోడి ఆరోగ్యానికి రాష్ట్రంలో భరోసా లేదని ఆగ్రహించారు. ప్రజా రోగ్యంపై కూటమి ప్రభుత్వానిది అంతులేని నిర్లక్ష్యం అని ఫైర్ అయ్యారు.

ఆరోగ్య శ్రీ సేవల కింద రూ.3500 కోట్లు పెండింగ్ పెట్టడం నిజంగా సిగ్గుచేటు
అన్నారు. ఆరోగ్య శ్రీ పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్రలో భాగమే ఇదంతా అంటూ ఫైర్ అయ్యారు వైఎస్ షర్మిల.
కాగా ఏపీలో ఎన్టీఆర్ ఆరోగ్య శ్రీ వైద్య సేవలు బంద్ అయ్యాయి. ఇవాల్టి నుంచి… ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్టీఆర్ ఆరోగ్య శ్రీ వైద్య సేవలు బంద్ కాబోతున్నాయి. ఈ మేరకు ఆరోగ్యశ్రీ కింద పని చేస్తున్న ఆసుపత్రుల యాజమాన్యాలు ప్రకటన చేశాయి. దాదాపు 3500 కోట్ల పెండింగ్ బిల్స్ చెల్లించాలని ఏపీ స్పెషాలిటీ ఆసుపత్రుల యాజమాన్యాలు డిమాండ్ చేస్తున్నాయి.