హైదరాబాద్ మహానగరంలో ఏడడుగుల కండక్టర్ ఇబ్బందులు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ఆ కండక్టర్ ఎత్తు ఏడడుగులు. కానీ ఆర్టీసీ బస్సు మాత్రం ఏడడుగుల హైట్ లేదు. దీంతో మెడలు వంచి మరి బస్సులో టికెట్లు కొడుతున్నాడు కండక్టర్. అయితే ఈ విషయం తెలంగాణ ప్రభుత్వం దృష్టికి వచ్చింది.

మెహిదీపట్నం డిపోలో ఆర్టీసీ బస్సు కండక్టర్గా అహ్మద్ అనే ఏడడుగుల కుర్రాడు పనిచేస్తున్నాడు. బస్సులో 6.4 అడుగులు ఎత్తే ఉంటుంది. దీంతో అహ్మద్ ఇబ్బంది పడుతున్నాడు. తరచూ మెడ నొప్పి అలాగే వెన్ను నొప్పి వస్తుందని కండక్టర్ చెబుతున్నాడు. అయితే అహ్మద్ పరిస్థితి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి వచ్చిందని…. అతనికి ఆర్టీసీలో సరైన ఉద్యోగం ఇవ్వాలని సజ్జనార్ కు పొన్నం ప్రభాకర్ సూచించారట.