తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ కొనసాగుతోంది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు తరలివస్తున్నారు. దీంతో తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ పెరిగింది. భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామి వారిని దర్శించుకుని.. మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ క్రమంలో నేడు (బుధవారం) వైకుంఠం క్యూకాంప్లెక్స్ లో 14 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఇక టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. మంగళవారం 68,427 మంది భక్తులు (Devotees) స్వామివారిని దర్శించుకున్నారు. 21,066 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. కానుకల రూపంలో శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.81 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు.