బ్రేకింగ్: తూర్పు గోదావరి జిల్లాలో ఒకే పోలీస్ స్టేషన్ లో 31 మందికి కరోనా…!

-

తూర్పు గోదావరి జిల్లాలో కరోనా కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. కరోనా కట్టడికి ఎన్ని విధాలుగా చర్యలు చేపట్టినా సరే కరోనా కేసులు జిల్లాలో 30 వేలకు పైగా నమోదు అయ్యాయి. అక్కడి సామాన్యులనే కాదు పోలీసులను కూడా కరోనా రకరకాలుగా వేధించడం మొదలుపెట్టింది. తూర్పు గోదావరి జిల్లా తునిలో ఒక విషయం వెలుగులోకి వచ్చింది. తుని పోలీస్ స్టేషన్ లో 36 మంది ఉన్నారు.

31 మంది పోలీసులకు కరోనా సోకింది. వారిలో ఇద్దరి ఆరోగ్యం విషమంగా మారింది. అధికారులు ఈ పోలీస్ స్టేషన్ పై ప్రత్యేక దృష్టి పెట్టి విధులకు ఎవరిని రావొద్దు అని ఆదేశాలు ఇచ్చారు. పోలీసుల కుటుంబ సభ్యులను కూడా కరోనా పరిక్షలు చేయించుకోవాలని చెప్పి ప్రత్యేక బృందంతో వారికి కరోనా పరిక్షలు నిర్వహిస్తున్నారు. మిగిలిన వారి కరోన పరిక్షా ఫలితాలు రావాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version