నేరాలు అనేవి ఏ ప్రభుత్వం అధికారంలో వున్నా జరుగుతాయని అన్నారు విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ. విశాఖలో నేరాలు,ఘోరాలు ఏమీ జరగడం లేదన్నారు. నేను వైజాగ్ వదిలిపోవలనే ఆలోచనలు రావడానికి మీడియానే కారణం అన్నారు. వందల అపార్ట్ మెంట్లు కట్టినప్పుడు రాని ఆరోపణలు ఎంపీ అయిన తర్వాతే నన్ను ఇబ్బందులు గురి చేస్తున్నారని అన్నారు. తప్పుడు ప్రచారాలతో మనస్తాపానికి గురయ్యే వైజాగ్ వీడి పోవాలని భావించానన్నారు.
బిల్డర్లు నన్ను ఒక రోల్ మోడల్ గా భావిస్తోంటే.. మీడియా వక్రీకరిస్తోందని ఆరోపించారు. అధికార పార్టీ ఎంపీగా నా పనులు నేను చక్కబెట్టుకో గలనని.. ఎవరికో భయపడి పారిపోవాలిసిన అవసరం లేదన్నారు. ఇక ఎంపీ రఘు రామకృష్ణ రాజు గజ్జికుక్కతో సమానమని తీవ్ర విమర్శలు చేశారు. కిడ్నాప్ ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సీబీఐ విచారణకు ఆదేశిస్తే సహకరిస్తానన్నారు.
12వ తేదీ నుంచి కిడ్నాపర్లు పట్టుబడ్డ వరకు జరిగిన ఎపిసోడ్ మీద సమగ్ర విచారణ జరిపించాలన్నారు. ఎంపీకే రక్షణ లేదనే అంశాన్ని చంద్రబాబు, ఇతర నాయకులు రాజకీయం చేయడం తగదన్నారు. పవన్ కళ్యాణ్ బాగా మాట్లాడారని.. నాకు అధికారం ఉంటే ఎన్ కౌంటర్ చేసేవాడిని అన్నారని చెప్పుకొచ్చారు. నర్సాపురం నియోజకవర్గానికి ఒక్క పనైనా రఘు రామ కృష్ణ రాజు చేశారా..? అని ప్రశ్నించారు.