ఏపీ రైతులకు శుభవార్త చెప్పింది జగన్ సర్కార్.సెప్టెంబరు 30 వరకు పంటలు వేసుకోవచ్చని ప్రకటించింది. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో వచ్చే నెల 30 వరకు పంటలు వేసుకునే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ తెలిపింది.
ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల కారణంగా… వరికి బదులు ప్రత్యామ్నాయ పంటల వైపు కొందరు రైతులు మొగ్గు చూపే అవకాశం ఉందని పేర్కొంది. 2.70 లక్షల హెక్టార్లలో ప్రత్యామ్నాయ పంటల సాగుకు కావాల్సిన 60 వేల క్వింటాళ్ల విత్తనాలను సిద్ధం చేసినట్లు వెల్లడించింది. వీటిని రైతులకు 80% రాయితీపై అందిస్తామని ప్రకటించింది.
కాగా, సోలార్ పవర్ ప్రాజెక్ట్ కు శంఖుస్థాపన చేయనున్నారు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సీఎం జగన్. ఇవాళ గ్రీన్ కో ఎనర్జీస్ సంస్థకు చెందిన సోలార్ పవర్ ప్రాజెక్ట్ కు శంఖుస్థాపన చేయనున్నారు ఏపీ సీఎం జగన్. 2300 మెగా వాట్స్ సామర్థ్యంతో సోలార్ పవర్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేశారు.