విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు అనంతపురంలోని మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ నివాసానికి వెళ్లి ఆయనకు నోటీసులు అందించారు. ముఖ్యంగా BNS సెక్షన్ 35/3 కింద నోటీసులు అందించారు. మార్చి 05న హాజరు విజయవాడ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ కి హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు. ఈ సందర్భంగా గోరంట్ల మాధవ్ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం రాష్ట్రమంతటా భయంకర వాతావరణాన్ని సృష్టిస్తున్నారు.
మార్చి 05న లీగల్ అడ్వయిజర్ తో కలిసి పోలీస్ స్టేషన్ కి వెళ్తానని చెప్పారు గోరంట్ల. ఓ ఇంటర్వ్యూ లో పోక్సో కేసులో బాధితురాలు పేరు గోరంట్ల చెప్పారని కేసు నమోదు చేశారు. మాట్లాడే హక్కును, భావ స్వేచ్ఛ హక్కును ప్రభుత్వం విస్మరిస్తుంది.తప్పుడు కేసులు, అక్రమ అరెస్ట్ లు చేసుకుంటూ పోతే రాష్ట్రంలో అంతర్యుద్దాలు తప్పవు అన్నారు. నవంబర్ 02, 2024న మహిళా కమిషన్ లో వాసిరెడ్డి పద్మ ఫిర్యాదు చేసింది.