ఎస్ఎల్బీసీ టన్నెల్ ఘటనాస్థలాన్ని బీఆర్ఎస్ నేతల బృందం గురువారం పరిశీలించింది. మాజీ మంత్రి హరీష్ రావు నేతృత్వంలో బీఆర్ఎస్ నాయకులు టన్నెల్ వద్ద జరుగుతున్న రెస్క్యూ ఆపరేషన్ పనులను పరిశీలించారు. అనంతరం వారు మీడియాతో మాటాడుతూ.. ఈ ఘటనను రాజకీయం చేయబోమని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.
కార్మికులు క్షేమంగా బయటికి రావాలని తాము కోరుకుంటున్నామని తెలియజేశారు. నీళ్ళు ఇచ్చే ఉద్దేశంతో ఎస్ఎల్బీసీ ప్రాజెక్ట్ ప్రారంభించలేదని గతంలోనే కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించారన్నారు. రెండు కొండల మధ్య ఉన్న టన్నెల్ భాగంలో ఈ ప్రమాదం జరిగిందని నిపుణులు చెబుతున్నారని వెల్లడించారు. పనులు ప్రారంభించే ముందు ప్రభుత్వం ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారో చెప్పాలని నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు.