విశాఖకు భారీ తుఫాన్ ముప్పు, ఏపీ సర్కార్ కి షాక్…?

-

ఆంధ్రప్రదేశ్ నూతన పరిపాలనా రాజధానిగా చెప్తున్న విశాఖకు ఇప్పుడు కరోనాతో పాటుగా తుఫాన్ ప్రమాదం కూడా భారీగా పొంచి ఉందని సమాచారం. విశాఖ వైపుగా తుఫాన్ అత్యంత వేగంగా దూసుకుని రావడంతో నగరంలో వాతావరణం క్రమంగా మారుతుంది. ఇప్పుడు విశాఖలో తుఫాను ముందు ప్రశాంతత ఉంది. అక్కడ చల్లగా వాతావరణం ఉండటమే కాకుండా ఎండ తీవ్రత చాలా ప్రాంతాల్లో లేదని అధికారులు చెప్తున్నారు.

ఇది ముందస్తు తుఫాన్ సంకేతం. బంగాళాఖాతంలో అండమాన్‌కు దక్షిణ దిశగా ఏర్పడిన అల్పపీడనం క్రమంగా వాయుగుండంగా మారుతుంది. ఈ నెల 8వ తేదీ నాటికి ఆ అల్పపీడనం మరింత బలపడి తీవ్రమైన తుఫాన్‌గా మారుతున్న ఈ తుఫాన్ కి ఒక పేరు కూడా పెట్టారు. ఎంఫాన్‌ అనే పేరు దీనికి పెట్టారు. దీని ప్రభావం విశాఖ మీద ఎక్కువగా ఉంటుంది అని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఎంఫాన్‌ తుఫాన్ ఓడిస్సా పశ్చిమ బెంగాల్, ఏపీ రాష్ట్రాల మీద తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ నెల 13వ తేదీ నాటికి మయన్మార్ వద్ద తుఫాన్ తీరాన్ని దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఉత్తరాంధ్ర ఓడిస్సా తీర ప్రాంతాల్లో దీని ప్రభావం చాలా అధికంగా ఉంటుందని, భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉరుములు మెరుపులతో వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంటుంది. ఇప్పుడు విశాఖ మీద తుఫాన్ ప్రభావం చూపిస్తే ఏపీ సర్కార్ మీద ఒత్తిడి పెరుగుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version