విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ స్పష్టంగా కనిపిస్తోంది. దసరా శరన్నవరాత్రులలో కనకదుర్గమ్మ ఇవాళ 4వ రోజు లలితా త్రిపురసుందరీ దేవిగా దర్శనం ఇవ్వనున్నారు. దీంతో ఇవాళ తెల్లవారు ఝామున 4 గంటల నుంచీ క్యూలైన్లలో భక్తులు ఉన్నారు. అటు ఇవాళ ఆదివారం కావడంతో భారీ సంఖ్యలో భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు అధికారులు. దీంతో అన్నప్రసాదం, లడ్డు ప్రసాదం ఎప్పటికప్పుడు అందుబాటులో ఆలయ అధికారులు ఉంచుతున్నారు.
భక్తులకు పాలు, త్రాగు నీరు, మెడికల్ వసతులు కూడా అందుబాటులో ఆలయ అధికారులు ఉంచుతున్నారు. కొండ దిగువన పున్నమి ఘాట్ వద్ద నుంచీ వీఐపీ దర్శనం భక్తులకు వాహనాలు పార్కింగ్ ఏర్పాటు చేశారు. క్యూలైన్ల లో భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకునేందుకు పోలీసు సేవాదళ్, రెడ్ క్రాస్ వాలంటీ ర్లు రంగంలోకి దిగాయి.