TTD : తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త అందించింది. ఏప్రిల్ నెలకు సంబంధించి సీనియర్ సిటిజన్లు/వికలాంగుల కోటా టికెట్లను జనవరి 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనుంది. అలాగే రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టోకెన్లను జనవరి 24న ఉదయం 10 గంటలకు రిలీజ్ చేయనుంది. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు ఏప్రిల్ నెల వసతి కోట టోకెన్ రిలీజ్ చేస్తామని తెలిపింది.
ఇది ఇలా ఉండగా, అయోధ్యలో రామ్ లల్లా విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమాన్ని టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. తమిళం, కన్నడ, హిందీ ఛానల్ తో పాటు తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా అయోధ్యలో జరిగే అన్ని వైదిక కార్యక్రమాలను లైవ్ లో వీక్షించేలా ఏర్పాటు చేసింది. ఎస్విబిసి ఛానల్ లో రేపు మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రత్యక్ష ప్రసారాలు ప్రారంభమవుతాయి.