తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలన్నీ వచ్చే నెల 10వ తేదీ నుండి ప్రారంభం కానున్నట్లు టిటిడి ఈవో శ్యామలరావు తెలిపారు. ఇందుకు సంబంధించి జనవరి 8వ తేదీ ఉదయం 6:00 నుండి టోకెన్లు జారీ చేయనున్నట్లు వెల్లడించారు. తిరుమల తిరుపతిలో 9 కేంద్రాలలో 91 కౌంటర్లు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు శ్యామలరావు.
ఇక గోవింద మాల భక్తులకు ప్రత్యేక టికెట్లను ఇవ్వడం లేదని ఆయన స్పష్టం చేశారు. ఇక జనవరి 10 నుంచి 19 వరకు పది రోజుల పాటు రోజుకు దాదాపు 70 వేలకు పైగా భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించేలా టీటీడీ చర్యలు చేపట్టింది.
ఇప్పటికే 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఆన్లైన్ లో విడుదల చేసిన రోజుకు 40 వేల చొప్పున 10 రోజులకు 4 లక్షల సర్వదర్శన టోకెన్లను తిరుపతిలో 8, తిరుమలలో ఒక కేంద్రం ద్వారా జారీ చేయడానికి ఏర్పాట్లు చేస్తోంది. ఏకాదశి మొదలు పది రోజులపాటు వైకుంఠ ద్వార దర్శన ఏర్పాట్లకు టిటిడి పలు చర్యలు తీసుకుందని ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకన్న చౌదరి తెలిపారు.