చాలా శాతం మందికి సహజంగా కలలు వస్తూ ఉంటాయి. నిద్రపోయిన తర్వాత ఎన్నో రకాల ఆలోచనలు ఉండడం వలన కలలు వస్తూ ఉంటాయి. అయితే కొన్ని కలలు వస్తే ఎంతో మంచి ఫలితాలు వస్తాయని చాలా శాతం మంది నమ్ముతారు. ముఖ్యంగా చైత్ర నవరాత్రులు మొదలవడంతో ఈ సమయంలో వచ్చేటువంటి కలలు ఎంతో మంచి ఫలితాలను అందిస్తాయని పండితులు చెబుతున్నారు. తొమ్మిది రోజుల పాటు ఈ చైత్ర నవరాత్రులు కొనసాగుతాయి మరియు ఈ సమయంలో దుర్గాదేవిని పూజించడం వలన ఎంతో మంచి ఫలితం మరియు పుణ్యం వస్తుంది.
కనుక ఈ తొమ్మిది రోజులు తప్పక దుర్గాదేవిని పూజించండి. అంతేకాకుండా, మీ జీవితంలో ఉండే కష్టాలన్నీ తొలగిపోయి చాలా సంతోషంగా ఉంటారు. ఈ చైత్ర నవరాత్రుల సమయంలో మీకు ఇటువంటి కలలు వచ్చినట్లయితే అమ్మవారి కటాక్షాన్ని తప్పకుండా పొందవచ్చు. ఎప్పుడైతే దుర్గాదేవి కలలోకి వస్తుందో మీకు ఎంతో మంచి ఫలితాలు ఎదురవుతాయి. అంతేకాకుండా ఎన్నో విజయాలను కూడా పొందుతారు. ముఖ్యంగా జీవితాంతం సంతోషంగా ఉండవచ్చు అని పండితులు చెబుతున్నారు. ఈ నవరాత్రుల సమయంలో దుర్గాదేవి ఆలయాన్ని కనుక మీరు కలలో చూస్తే, కుబేరుడి అనుగ్రహాన్ని పొందుతారు.
కనుక సంపద ఎక్కువ అవుతుంది మరియు ఆర్థిక సమస్యల నుండి దూరంగా ఉండవచ్చు.
ఈ తొమ్మిది రోజులలో కలలో సింహం వచ్చినట్లయితే, శత్రుత్వానికి సంబంధించిన బాధలు ఉండవు. దాంతో ఎటువంటి సమస్యలు లేకుండా ఆనందంగా జీవిస్తారు. సింహంతో పాటు దుర్గాదేవి వచ్చినా సరే ఎంతో మంచి జరుగుతుంది. చైత్ర నవరాత్రుల సందర్భంలో దుర్గాదేవి విగ్రహం కలలో వస్తే, జీవితంలో ఎన్నో ఇబ్బందుల నుండి బయటపడవచ్చు. ఎలాంటి ఇబ్బందులు ఉన్నా తొలగిపోతాయి. ముఖ్యంగా ఎంతో సంతోషంగా జీవించవచ్చు.