ప్రస్తుతం కలెక్టర్ పోస్ట్ కంటే కూడా ఐటీ ఉద్యోగికే డిమాండ్ ఎక్కువగా ఉందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. అమరావతిలోని విట్ వర్సిటీలో పలు అభివృద్ధి పనులు ప్రారంభించారు సీఎం. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సిలికాన్ వ్యాలీ సంస్థల సీఈవోలుగా ఎక్కువగా భారతీయులే ఉన్నారని గుర్తు చేసారు. హైదరాబాద్ లో నేను హైటెక్ సిటీ నిర్మించానని.. భవిష్యత్ అంతా ఐటీ దేనని అప్పట్లోనే చెప్పాను దేశంలోని ఐఐటీలలో 20 శాతం సీట్లు తెలుగోళ్లే కొల్లగొడుతున్నారు. అన్నింటిలో తెలుగువారు ముందుండాలనేదే నా ఆకాంక్ష అని తెలిపారు.
ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా భారతీయులుంటారు.. అందులో అగ్రస్థానంలో తెలుగువారు ఉంటారని పేర్కొన్నారు. మే 2 ప్రధాని నరేంద్ర మోడీ అమరావతికి వస్తున్నారు. ప్రధాని చేతుల మీదుగా అమరావతి పున:ప్రారంభం కాబోతుందని.. అప్పట్లో ఐటీని ప్రమోట్ చేశానని.. ఇప్పుడు క్వాంటమ్ టెక్నాలజీని ప్రమోట్ చేస్తున్నానని తెలిపారు. ఒకప్పుడు ప్రభుత్వ అటెండర్ ఉద్యోగానికి కూడా డిమాండ్ ఉండేది. ఇప్పుడు కలెక్టర్ పోస్ట కంటే ఐటీ ఉద్యోగానికి డిమాండ్ ఎక్కువగా ఉందన్నారు.