కేసీఆర్ స్పీచ్ పై మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ విమర్శలు చేశారు. వరంగల్ సభలో కేసీఆర్ పచ్చి అబద్ధాలు ఆడారని ఫైర్ అయ్యారు. కేంద్ర ప్రభుత్వ నిధులతోనే తెలంగాణ గ్రామాలను అభివృద్ధి చేస్తున్నారని కేసీఆర్ స్పీచ్ పై ఎంపీ డీకే అరుణ విమర్శలు చేశారు. కేంద్ర నిధులతో కాకపోతే కేసీఆర్ జేబులో నుంచి తీసి ఇచ్చారా ? అని నిలదీశారు మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ.
2023 వరకే తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం రూ.9 లక్షల కోట్లు నిధులు ఇచ్చిందన్నారు. మహబూబ్ నగర్ లో ఏ ప్రొజెక్టును బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి చేయలేదని పేర్కొన్నారు ఎంపీ డీకే అరుణ. ప్రజలను మోసం చేశారు కాబట్టే వాళ్లను ఇంటికి పంపించారన్నారు మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ.