నేరస్తులు రాజకీయ ముసుగులో ఉంటే ప్రజాస్వామ్యానికి పెనుముప్పు అని సీఎం చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో కొంత మంది నేతలతో సమీక్ష నిర్వహించారు సీఎం చంద్రబాబు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో గత ఐదేళ్లు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన వారు ఇప్పుడు కొత్త దారులు వెతుక్కుంటున్నారన్నారు. ఒక అబద్దాన్ని పదే పదే చెప్పి నిజమని నమ్మించాన్నది వారి తాపత్రయం అని మండిపడ్డారు. స్వార్థ ప్రయోజనాల కోసం ఎంతటి వారినైనా ముంచేందుకు వారు వెనుకాడరని స్పష్టం చేశారు.
నా దళితులు..నా దళితులు అంటూనే వారిని నట్టేట ముంచే రకాలను వెల్లడించారు. ఆటవిక రాజ్యంలోనే దాడులు, ఊచకోతలు, విధ్వంసాలు, హత్యలు జరుగుతాయని మనది ప్రజాస్వామ్యం, ఇక్కడంతా చట్టపరంగానే పరిపాలన సమర్థంగా నడుస్తోందని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలు, కార్యకర్తల సంక్షేమం పై ప్రదానంగా చర్చించారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవ్వరికీ మద్దతు ఇవ్వాలనే అంశం పై త్రిసభ్య కమిటీ ఏర్పాటుకు సమావేశంలో చంద్రబాబు నిర్ణయించారు.