అన్ని పార్టీల ఎంపీలతో డిప్యూటీ సీఎం భట్టి సమావేశం..!

-

కేంద్ర ప్రభుత్వం వద్ద రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్లో ఉన్న సమస్యల పరిష్కారానికి అన్ని పార్టీల ఎంపీలతో సమావేశం నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ప్రణాళిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క అధ్యక్షతన శనివారం ఉదయం 11 గంటలకు ప్రజాభవన్ లో ఈ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం వద్ద అపరిష్కృతంగా ఉన్న రాష్ట్రానికి సంబంధించిన వివిధ సమస్యలపై చర్చించనున్నారు.

పెండింగ్ లో ఉన్న సమస్యలపై ఎంపీలు  రాష్ట్రం పక్షాన పార్లమెంట్ లో, కేంద్ర ప్రభుత్వం వద్ద
మాట్లాడాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రయత్నం చేస్తుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరవుతున్నారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ తో పాటు రాష్ట్రానికి సంబంధించిన ఎంపీలందరిని శుక్రవారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు స్వయంగా ఫోన్ చేసి సమావేశానికి ఆహ్వానించారు.

Read more RELATED
Recommended to you

Latest news