మాజీ మంత్రి దేవినేని ఉమా ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మాజీ మంత్రి దేవినేని ఉమా సోదరుడు చంద్రశేఖరరావు కన్నుమూశారు. ఊపిరితిత్తులు సంబంధిత వ్యాధితో కొంతకాలంగా బాధపడుతున్నారు దేవినేని చంద్రశేఖర్. ఈ తరుణంలోనే…. హైదరాబాద్ లోని ప్రైవేట్ ఆస్పత్రిలో గత నాలుగు రోజులుగా చంద్రశేఖర్ చికిత్సపొందుతున్నారు.
అయితే..మాజీ మంత్రి దేవినేని ఉమా సోదరుడు చంద్రశేఖరరావు ఆరోగ్య పరిస్థితి కాస్త విషమించడంతో…ఇవాళ తెల్లవారు జామున మృతి చెందారు. ఇక అటు మూడు రోజులుగా హైదరాబాద్ లోనే ఉమా ఉన్నారు. ఈ రోజు ఉదయం 8 గంటలకు హైదరాబాదు నుంచి కంచికచర్లకు చంద్రశేఖర్ పార్థివదేహాన్ని తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక అటు మాజీ మంత్రి దేవినేని ఉమా సోదరుడు చంద్రశేఖరరావు మృతి పట్ల పలువురు నాయకులు సంతాపం తెలుపుతున్నారు.