నల్లమల్ల అడవుల్లో దారి తప్పిన భక్తులు.. కాపాడిన ఫారెస్ట్ అధికారులు

-

శీతాకాలంలో సాధారణంగా శివ భక్తులు శ్రీశైలం లోని బ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని దర్శించుకునేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. కొంత మంది పాదయాత్ర ద్వారా దేవుడిని దర్శించుకుంటే పాపాలు పోతాయని నమ్ముతుంటారు. ఇలా రకరకాలుగా శ్రీశైలం సన్నిధిలోకి వస్తుంటారు. కొంత మంది వాహనాల ద్వారా.. మరికొందరూ పాదయాత్ర ద్వారా చేరుకుంటారు. ఏపీలోని ప్రకాశం జిల్లా నల్లమల్ల అడవుల్లో డోర్నాల నుంచి శ్రీశైలం దేవస్థానం మార్గ మధ్యలో ఇష్టకామేశ్వరి అమ్మవారి దేవస్థానానికి వెళ్లిన 15 మంది భక్తులు దారి తప్పి అడవిలోకి వెళ్లి చిక్కుకుపోయారు.

Forest

దీంతో భయాందోళనకు గురైన భక్తులు సాయంత్రం సమయంలో డయల్ 100కి సమాచారం ఇచ్చారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు స్థానిక ఫారెస్ట్ అధికారులను అప్రమత్తం చేయడంతో.. గాలింపు చర్యలు చేపట్టారు ఫారెస్ట్ అధికారులు. సాంకేతిక పరిజ్ఞానంతో రాత్రి 7 గంటలు దాటిన తరువాత అడవిలో వారు ఉన్న ప్రాంతాన్ని గుర్తించి సురక్షిత ప్రాంతానికి తరలించారు. ప్రస్తుతం వారు ఫారెస్ట్ అధికారుల సంరక్షణలో ఉన్నారు. దారి తప్పిన 15 మంది భక్తులు బాపట్ల జిల్లా రేపల్లె మండలం మంత్రిపాలెం గ్రామానికి చెందిన వారు అని ఫారెస్ట్ అధికారులు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news