ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పై ఘాటు వ్యాఖ్యలు చేశారు టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు. నేడు మంగళగిరి పార్టీ ఆఫీసులో దళిత వర్గాలతో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. జగన్ వి నవరత్నాలు కాదు.. నవ మోసాలు అని విమర్శించారు. జగన్ ఫోటో ఉండాల్సింది ఇంటికి తలుపులపై కాదని.. పోలీస్ స్టేషన్లో ఉండాలని మండిపడ్డారు.
జగన్ ప్రత్యేకంగా ఎస్సీల కోసం ఒక్క బటన్ అయినా నొక్కారా అని ప్రశ్నించారు చంద్రబాబు. టిడిపి పుట్టిన తరువాతే ఎస్సీ, ఎస్టీలకు పదవులు, పథకాలు అందాయని అన్నారు. టిడిపి తీసుకువచ్చిన అంబేద్కర్ విదేశీ విద్యా పథకానికి ఇప్పుడు జగన్ పేరు పెట్టుకున్నారని ఆరోపించారు. ప్రభుత్వ సలహాదారులుగా దళితులను ఎందుకు నియమించలేదు చెప్పాలన్నారు చంద్రబాబు. వైసిపి ప్రభుత్వం దళితుల కోసం ఒక్క పైసా కూడా ఖర్చు చేయలేదన్నారు.