Samantha జీవితంలో ఇన్ని కష్టాలు ఉన్నాయా.. నిజంగా గ్రేట్..

-

Samantha : సమంతా.. ఈ పేరు తెలియని వాళ్ళు ఉండరేమో.. ఎన్నో కష్టాలను అధిరోహించి ఈ స్థాయికి వచ్చిన ఆమె జీవితం అందరికి ఆదర్శం అనే చెప్పాలి.. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి ఎటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి ప్రస్తుతం పాన్ ఇండియా హీరోయిన్గా చలామణి అవుతూ సుమారుగా రూ.5 కోట్లకు పైగా పారితోషకం అందుకుంటూ తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా హీరోలతో సరి సమానంగా పాపులారిటీ సొంతం చేసుకున్న ఏకైక హీరోయిన్ సమంత అని చెప్పాలి. ఇక నటనలో అందంలో ఈమె తర్వాతే ఎవరైనా.. ఈరోజు ఆమె పుట్టినరోజు.. నేడు 37 వ సంవత్సరంలోకి సమంత అడుగు పెడుతుంది..

Samantha

గౌతమీ మీనన్ దర్శకత్వంలో తెరకేక్కించిన ఏమాయ చేసావే అనే సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన సమంత అదే సినిమాతో కుర్రాళ్ల గుండెలను దోచుకుంది. మొదటి ప్రయత్నంతోనే మంచి పాపులారిటీ దక్కించుకున్న ఈమెకు ఆ తర్వాత వరుసగా స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు లభించాయి. అలా దూకుడు, అత్తారింటికి దారేది సినిమాలు ఈమె రేంజ్ ను మరింత పెంచాయనే చెప్పాలి. ఇక తెలుగులోనే కాదు తమిళ్లో కూడా సూర్య, విజయ్, విక్రం లాంటి హీరోలతో నటించింది. అలాగే ఇటీవల బాలివుడ్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది..వరుస హిట్ లతో ఫుల్ బిజీగా ఉన్న సమయంలోనే నాగచైతన్యను పెళ్లి చేస్తుంది..అక్కినేని కోడలు అయింది. అయితే ఆ ట్యాగ్ ను ఎక్కువ రోజులు మెయింటైన్ చేయలేకపోయింది ఈ అమ్మడు..

నాగచైతన్య నుంచి విడిపోతే తన జీవితంలో ఊహించని మలుపులు ఎదురవు తాయని ఆలోచించలేదే ఏమో కానీ ఎప్పుడైతే అతడికి విడాకులు ఇచ్చిందో అప్పటినుంచి ఈమె జీవితం అల్లకల్లోలం అయిందని చెప్పాలి. ప్రతి విషయంపై కూడా ఆమెను పూర్తిస్థాయిలో నెగిటివ్ గా ట్రోల్ చేశారు. ఏ పని చేసిన నెగిటివ్గా స్పందించారు. ఎన్నో కష్టాలను పడింది. అంతకుమించి ఇబ్బందులను ఎదుర్కొంది.. మానసికంగా, శారీరకంగా కూడా అనారోగ్య సమస్యతో ఇబ్బందులు పడుతూనే ఉంది.. వాటన్నింటినీ పట్టించుకోకుండా ఎన్ని కష్టాలు వచ్చినా ఎదురీది శిఖరాలను అధిరోహించింది. ఎంతోమందికి ఆదర్శంగా నిలిచింది.. సమంత రహస్యాలు కొంతమందికి తెలియదు. ఇది విన్న వారంతా అయ్యో పాపం ఇన్ని కష్టాలు పడిందా అని జాలి చూపిస్తున్నారు.. ఇక సామ్ ఇప్పుడు వెబ్ సిరీస్ లతో బిజీగా ఉంది..

Read more RELATED
Recommended to you

Exit mobile version