గ్రేటర్ విశాఖ మేయర్ పీఠాన్ని కూటమి కైవసం చేసుకుంది. వైసీపీ మేయర్ పై అవిశ్వాస పరీక్ష ఓటమి పాలయ్యారు. అయితే మేయర్ మీద అవిశ్వాసం గెలిచారు. కానీ విశాఖ ప్రజల మనస్సులో విశ్వాసం కోల్పోయారు అంటూ వ్యాఖ్యానించారు గుడివాడ అమర్నాథ్. విశాఖ మేయర్ ఎన్నికల్లో పరిణామాలపై ఆయన స్పందిస్తూ.. బలం లేకుండా అవిశ్వాస తీర్మాణం నోటీసులు అందజేశారని ధర్మం, న్యాయం గురించి మాట్లాడే హక్కు కూటమి నాయకులకు లేదని దుయ్యబట్టారు.
విప్ ఉల్లంఘించిన వారి పదవులు పోవడం ఖాయమన్నారు. యాదవ సామాజిక వర్గానికి చెందిన మహిళకు మా నాయకుడు జగన్.. మేయర్ పదవీ ఇచ్చారు. కానీ ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేస్తామని ప్రలోభ పెట్టారని మండిపడ్డారు. 99 పైసలకే విశాఖ భూములను ఇష్టానుసారంగా కట్టబడుతున్నారు. ఇదే తరహాలో భూముల కట్టబెడతామని మంత్రి నారా లోకేష్ చెబుతున్నారు. అసలు టీసీఎస్ విశాఖ రాకముందే భూముల అప్పనంగా కట్టబెడుతున్నారని విమర్శించారు.