మద్యం కుంభ కోణం కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి సిట్ విచారణ ముగిసింది. అధికారులు 8 గంటల పాటు ఆయనను ప్రశ్నించారు. అనంతరం వాంగ్మూలం పై ఎంపీ సంతకం తీసుకున్నారు. మరోసారి మిథున్ రెడ్డికి నోటీసులు ఇచ్చిన విచారణకు పిలిచే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. నిన్న మాజీ ఎంపీ విజయసాయి రెడ్డిని అధికారులు విచారించారు.
ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు దాదాపు 8 గంటల పాటు ఆయనను విచారించారు సిట్ అధికారులు. స్టేట్ మెంట్ ను రికార్డు చేసి సంతకాలు తీసుకుంది సిట్. పలు అంశాల పై ఆరా తీసిన అధికారులు కీలక సమాచారాన్ని రాబట్టినట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారం పై మరోసారి ఆయనను పిలిచే అవకాశం ఉంది. అయితే విచారణకు ఎప్పుడు వెళ్లేందుకు అయినా సిద్ధమేనని గతంలోనే మిథున్ రెడ్డి ప్రకటించారు. మరికొద్ది సేపట్లోనే మిథున్ రెడ్డి మీడియాతో మాట్లాడే అవకాశం ఉందని పలువురు మీడియా ప్రతినిదులు పేర్కొంటున్నారు.