Ap pensions: ఏపీ ప్రజలకు అలర్ట్..ఇవాళ్టి నుంచి పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఉండనుంది. ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఉంటుంది. ఇప్పటికే డిబిటి, ఇంటింటికి పెన్షన్ల పంపిణి పై ఆదేశాలు జారీ చేసింది ఎలక్షన్ కమిషన్. ఉదయం 8:30 గంటల నుంచి 11 గంటలలోపు డిబిటి ద్వారా అకౌంట్లకే పెన్షన్లు రానున్నాయి.
డిబిటి పంపిణీలో ఎవరికైనా మిస్ అయితే 3న ఇంటికే పెన్షన్ రానునంది. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, బ్యాకు అకౌంటు ఆధార్ లింక్ కాని వారికి ఇంటి వద్దకే పెన్షన్ అందించనునన్నారు. సచివాలయాలకు ఎవరూ ఎండనపడి రావద్దంటున్నారు అధికారులు. యూపీఐ పేమెంట్ లు అందుబాటులో ఉండటంతో బ్యాంకు ఖాతాలకు బదిలీ త్వరగా అవుతుందంటున్నారు అధికారులు. బ్యాంకుల నుంచి తీసుకురావాల్సిన సొమ్ము కూడా తక్కువే కావడంతో పెన్షన్ల పంపిణీ సులభతరం కానుంది.