ఆంధ్రప్రదేశ్ ఉన్న జగన్ మోహన్ రెడ్డి సర్కార్ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. ఇప్పటికే అన్ని సంక్షేమ పథకాలు సక్సెస్ అయ్యాయి. ఇక ఈ తరుణంలోనే… ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్ కార్డులు ఉన్నవారికి శుభవార్త చెప్పింది. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా రేషన్ కార్డులు ఉన్నవారికి కందిపప్పు పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకుంది.
వచ్చే నెల నుంచి క్రమం తప్పకుండా రేషన్ దారులకు కిలో చొప్పున కందిపప్పు అందించనుంది. దీనికోసం రాష్ట్ర పౌరసరాఫరాల శాఖ 10వేల టన్నుల కందిపప్పును కొనుగోలు చేస్తోంది. ఇందుకు హైదరాబాద్ అగ్రికల్చరల్ కో ఆపరేటివ్ అసోసియేషన్ లిమిటెడ్ కు ఆర్డర్ ఇచ్చింది. అయితే హకా దగ్గర తగినంత నిల్వలు లేకపోవడంతో 7,200 టన్నుల కందిపప్పు సరాఫరా చేస్తామని చెప్పింది. ముందుగా తొలి విడతలో 3,660 టన్నులు, రెండో విడతలో 3,540 టన్నులు అందించనున్నారు.