తిరుమల శ్రీవారి సన్నిధిలో శాస్త్రోక్తంగా ‘దీపావళి ఆస్థానం’

-

తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం శాస్త్రోక్తంగా జరిగింది. ఇవాళ ఉదయం ఆలయ అర్చకులు, తిరుమల జీయంగార్లు, తితిదే ఉన్నతాధికారుల సమక్షంలో బంగారు వాకిలి చెంత ఆగమోక్తంగా ఈ వేడుకను నిర్వహించారు. బంగారు వాకిలి ముందున్న ఘంటా మండపంలో శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి, విష్వక్సేనుల వారి ఉత్సవమూర్తులను గరుడాళ్వారు సన్నిధిలో అభిముఖంగా ఉంచి ఆస్థానం నిర్వహించారు.

రాష్ట్రం సుభిక్షంగా ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని దీపావళి ఆస్థానాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించినట్లు తితిదే ఈవో ఏవీ ధర్మారెడ్డి చెప్పారు. భక్తులందరికీ శ్రీవారి ఆశీస్సులు అందాలని కోరుతూ దీపావళి ఆస్థానం నిర్వహించినట్లు ఆలయ ప్రధానార్చకుల్లో ఒకరైన శ్రీనివాస దీక్షితులు చెప్పారు. స్వామివారి మూలమూర్తికి, ఉత్సవ మూర్తులకు నూతన పట్టు వస్త్రాలు అలంకరించినట్లు తెలిపారు. ఇవాళ సాయంత్రం స్వామి, అమ్మవార్లు సహస్ర దీపాలంకరణ సేవలో పాల్గొని ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులకు కనువిందు చేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version