పవన్ కళ్యాణ్ కి ఏపీలో ఆధార్ కార్డు ఉందా? – కొడాలి నాని

-

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మండిపడ్డారు వైసిపి మాజీ మంత్రి కొడాలి నాని. షూటింగ్ విరామాల్లో పవన్ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోడ్లపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమం వీరికి కనిపించడం లేదని కొడాలి నాని నిప్పులు చెరిగారు. అసలు పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్లో ఆధార్ కార్డు ఉందా? అంటూ ప్రశ్నించారు.

పవన్ కళ్యాణ్ కి, చంద్రబాబు నాయుడు కి నేను సవాల్ విసురుతున్నానని.. భారతదేశంలో 10 నుంచి 20 శాతం వరకూ రోడ్లు గుంతలు లేని రాష్ట్రాన్ని చూపించాలని సవాల్ విసిరారు. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆత్మస్థైర్యాన్ని దెబ్బ తీయలేరని అన్నారు. ఎక్కడో షూటింగులు చేసుకుంటూ ఎక్కడో నివాసంలో ఉంటూ ఆంధ్రప్రదేశ్ కి వచ్చి రాజకీయాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. మళ్లీ సీఎంగా గెలిచే వరకు అసెంబ్లీలో అడుగు పెట్టనని మంగమ్మ శపథం చేసిన చంద్రబాబు నాయుడు తన మంగమ్మ శబదం గాలికి వదిలేశాడు అని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version